తిరుపతిలో పుట్ పాత్ ఆక్రమణలు తొలగించండి – కమిషనర్ అనుపమ అంజలి ఐ.ఏ.ఎస్

Spread the love

సాక్షిత : తిరుపతి నగరపాలక పరిధిలో పుట్ పాత్ ఆక్రమణలను, రోడ్లపై ప్రజలకు ఇబ్బందులు కల్గించే వారికి తగు చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, అధికారులు ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని పరిష్కరించమన్నారు. అలిపిరి ప్లై ఓవర్, కపిలతీర్థం రోడ్ పుట్ పాత్ లను మొత్తం ఆక్రమించేసి షాపులు నడుపుతున్నారని, ఇందువలన పార్కింగ్ కు ఇబ్బందిగా వుందనే పోన్ కాల్ పిర్యాదుపైన అదేవిధంగా రైతు బజార్ ముందర రోడ్డుపైన తోపుడు బండ్లు, గంపలో అమ్మేవారి వలన రైతు బజారుకు వచ్చే వాహనదారులకు ఇబ్బందిగా వుందని, అంతేకాకుండ తమకు సరిగా వ్యాపారం జరగడం లేదని రైతుబజారు నుండి వచ్చిన కొంతమంది వ్యాపారులు పిర్యాధు చేయడంతో స్పందించిన కమిషనర్ అనుపమ మాట్లాడుతూ ఆక్రమణదారులపై తగు చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడం జరిగింది.

కొటకొమ్మల వీధి నుండి ఒకరు పిర్యాదు చేస్తూ చెత్త బండికి స్పీకర్ పని చేయడం లేదని, అందువలన బండి వచ్చిన విషయం తెలియక ఇబ్బందిగా వుందని చెప్పడంతో కమిషనర్ అధికారులతో మాట్లాడుతూ చెత్తబండ్లకు స్పీకర్లు పని చేసేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అలా ప్రాబ్లమ్ వున్న చోట్ల తప్పని సరిగా అన్ని ఇండ్ల వద్దకు విజిల్ వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్ పార్క్ వెనుక గంగమ్మగుడి వద్ద చెత్తను డంపు చేస్తూన్నారనే పిర్యాదును పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు నంబర్ మూడులోని కైకాల చెరువు ప్రాంతంలో నివాసముండే తమకు రోడ్లు, కాలువలు నిర్మించాలని, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆ ప్రాంత ప్రజలు కోరడంతో పరిశిలించి తగు ఏర్పాట్లు చేస్తామన్నారు. శ్రీనగర్ కాలనీ ఐదవ క్రాసులో రోడ్లు, అండర్ డ్రైనేజి కల్పించాలనే విషయంపై తమ అధికారులు పరిశిలించి తగు చర్యలు చేపడుతారని హామి ఇవ్వడం జరిగింది. మరికొంతమంది పిర్యాది దారులకు హామి ఇస్తూ వారు సూచించిన పిర్యాదులపై తక్షణమే తమ అధికారులు పరిశీలించి తగు చర్యలు చేపడుతారని కమిషనర్ అనుపమ అంజలి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page