శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం
విగ్రహ ప్రతిష్ట మరియు కుంభాబిషేక మహోత్సవ ఆహ్వానము మేరకు శుక్రవారం ఉదయం మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మంగళం రోడ్డులోని 11వ క్రాస్, శ్రీరాముల వారి వీధి, ఉపాధ్యాయ నగర్, తిరుపతి నందు గత మూడు రోజుల నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు
.
ఆలయ ధర్మకర్త మండలి పైడా శ్రీనివాసరెడ్డి, తోట నరసింహులు నాయుడు, ఆలయ కమిటీ మెంబర్లు మేయర్ డాక్టర్ శిరీష కి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ధర్మకర్తలు, కమిటీ మెంబర్లు తదితరులతో అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ధర్మకర్తలు, కమిటీ మెంబర్లుకు శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగరపాల సంస్థ ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా ధర్మకర్త మండలి మరియు కమిటీ మెంబర్లకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ వారితో పాటు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి , కార్పొరేటర్లు ఆదం రాధారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయం
Related Posts
దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్
SAKSHITHA NEWS దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఎపీ సర్కార్ మరో జలక్ వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా ఫైబర్ నెట్ నుంచి 1.15 కోట్ల రూపాయలు అనుచిత లబ్ధి పొందటం పై లీగల్ నోటీస్. ఫైబర్ నెట్ చైర్మన్ జీవి…
క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్
SAKSHITHA NEWS క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగుడా ఆదర్శ్ నగర్ లోని గ్లోరియస్ ప్రార్థన మందిరం పాస్టర్ యం.యం.సురేష్ కుమార్ ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన సెమి క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్…