దేశంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే “

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామానికి చెందిన కోట్ పల్లి మండలం BSP ఉపాధ్యక్షులు CH. మొగులయ్య, BSP గ్రామకమిటి అధ్యక్షులు T. క్రిష్ణ, BJP గ్రామకమిటి అధ్యక్షులు నాగరాజు, BJP గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి P. నర్సిములు వికారాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని ఎన్నెపల్లి కి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు P ధర్మయ్య వారి అనుచరులు మొత్తం కాంగ్రెస్,BSP, BJP పార్టీల నుండి 25 మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page