SAKSHITHA NEWS

దేశానికి దిక్సూచి తెలంగాణ రాష్ట్రం – ఎమ్మెల్యే చిరుమర్తి

— దేశమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు

— నకిరేకల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం

నకిరేకల్ సాక్షిత ప్రతినిధి

దేశమే అబ్బురపడేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నాడు నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై నల్గొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి తో కలిసి నకిరేకల్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ
నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు మరియు అధికారులకి పలు సూచనలు చేశారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సీఎం కేసీఆర్ ప్రగతిని, సాధించిన విజయాలను ప్రజలందరికీ తెలిసేలా పకడ్బందీగా ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. ఈ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించాలని అన్నారు.
విద్యా, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక, స్త్రీ శిశు సంక్షేమం, విద్యుత్, నీటిపారుదల, అమరవీరుల సంస్మరణ, సంక్షేమ పథకాలు వంటి ప్రతి శాఖ అధికారులు దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి దిగ్విజయం చేయాలని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మరియు పరిస్థితులు ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే విషయాలను సుష్పష్టంగా ప్రజలకు తెలిసేలా చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి లా మారిందని అలాంటి అభివృద్ధిని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అనంతరం చిట్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన చిట్యాల మండల సమాచార కరదీపిక పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి,నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, చిట్యాల ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, రామన్నపేట ఎంపీపీ
కన్నెబోయిన జ్యోతి బలరాం యాదవ్, నార్కట్ పల్లి ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, నకిరేకల్ జడ్పిటిసి ధనలక్ష్మి నగేష్, చిట్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, మున్సిపాలిటీ కమిషనర్లు మందడి రామ దుర్గారెడ్డి, బాలాజీ, తహసిల్దార్ లు జక్కర్తి శ్రీనివాస్, ప్రసాద్, సిడిపిఓ శైలజ, ఎంపీవో పద్మ, ఏపీవో శ్రీలత, నాయకులు బెల్లి సత్తయ్య, జిట్ట బొందయ్య, జిట్టా చంద్రకాంత్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS