సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాపు సంక్షేమ సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి హైటెక్ సిటీ దగ్గరలో 6. 35 ఎకరాల స్తలం కేటాయించిన శుభసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి , మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తూ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియచేసిన కాపు సంఘాల సంక్షేమ ప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో కాపు సంఘాల సంక్షేమ సేవాసమితి అధ్యక్షులు మిర్యాల రాఘవరావు, జనరల్ సెక్రెటరీ కె ఎస్ ఎన్ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ దాసరి రంగారావు, కూకట్పల్లి కాపు సంఘం ప్రెసిడెంట్ భరత్ కుమార్ ,భగవాన్,,బసల శ్రీనివాస్, ఆనంద్ రావు ,బుట్టు రాంబాబు, వాసు నాయుడు, ఎదుర్ల సుబ్బారావు, ఆదిమూలం ,త్రినాధ రావు, కృష్ణ ,ఆర్జేఎన్ ప్రసాద్, వీరభద్ర రావు ,వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.