తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల శ్రేయస్సుకై అందిస్తున్న వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ చేతులమీదుగా డివిజన్ లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విధుల్లో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ కిట్లు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సూచించారు. ప్రజలు పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యవంతమైన జీవితం గడిపేందుకు నిరంతరం పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. కిట్లను అందుకున్న కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కార్పొరేటర్ కి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షులు పాండు గౌడ్, ఉపాధ్యక్షులు చిన్నోళ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, ముజీబ్, వెంకటేష్, SFA వై. శ్రీనివాస్, SRP వినయ్ కాంత్ రెడ్డి, మరియు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…