రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్ద పీట
–
చిట్యాల పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీ
చిట్యాల సాక్షిత
వ్యవసాయ రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం మారిందని మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
అన్నారు. చిట్యాల పట్టణ రైతు వేదికలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవ వేడుకలలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బందు, రైతు భీమా, 24గంటల ఉచిత విద్యుత్, సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పండించిన దాన్యాన్ని రైతుల కల్లాల వద్దే మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని అన్నారు. అంతకు ముందు కనకదుర్గ గుడి సెంటర్ నుండి రైతు వేదిక వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జడల అది మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు వనమ వెంకటేశ్వర్లు, గుండెబోయిన సైదులు, పొన్నం లక్ష్మయ్య, జిట్టా చంద్రకాంత్, సిలివేరు శేఖర్ కౌన్సిలర్లు రైతులు రైతులు మహిళలు వ్యవసాయ అధికారులు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.