తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలి

Spread the love


Telangana schemes should be implemented all over the country

తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలి .. రైతు తలెత్తుకుని నిలబడాలి:మంత్రి నిరంజన్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సంధర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మంత్రి మాట్లాడుతూ…

దేశానికి దార్శనికత ఉన్న నాయకత్వం కావాలి.దేశంలోని మానవ వనరులను, ప్రకృతి వనరులను సమర్దంగా ఉపయోగించుకుని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది,ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన పార్టీలకు రాజకీయ విధానాలు తప్ప వ్యవసాయ విధానాలు, కార్మిక విధానాలు, విదేశాంగ విధానాలు,

వాణిజ్య విధానాలు, వైద్య విధానాలు, విద్యా విధానాలు, ఉద్యోగ విధానాలపై ఒక స్పష్టత , ఆలోచన లేదు.60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం పట్ల కేంద్రానికి ఒక విధానం లేదు.తెలంగాణ పథకాలు దేశమంతా అమలుకావాలి .. రైతు తలెత్తుకుని నిలబడాలి.ప్రపంచంలో అగ్రగామిగా ఉండాల్సిన దేశం అన్నింటా వెనకబడి ఉన్నది.

కేవలం ఎనిమిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రస్థానంలో నిలిపారు.రేపు దేశానికి తెలంగాణ తరహా విధానాలు కావాల,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆవిర్భవించిన సంధర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు,

ఎర్రకోట మీద బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన ఆవశ్యకత ఉన్నది.బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సంధర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page