SAKSHITHA NEWS

Telangana National Unity 3 days Vajrotsava rally

తెలంగాణ జాతీయ సమైక్యత3రోజుల వజ్రోత్సవ ర్యాలీ. తాండూర్ నియోజకవర్గం,15 వేల మందితో సభనిర్వహన.


సాక్షిత వికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ పట్టణం లో 3 రోజులు అనగా 16,17,18 వరకు తెలంగాణ సీఎం కెసిఆర్ ఆదేశానుసారం,తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రో త్సవాలా ర్యాలీ,ప్రభుత్వ జూనీయర్ కళశాల మైదానం లో,స్థానిక శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి జాతీయ జెండాలతో ప్రారంభించారు, అక్కడి నుండి విల్యామూన్ వరకు పెద్ద ఎత్తు న గ్రౌండు లో ఏర్పాటు చేసిన స్టేజి వరకు వచ్చారు, సభాధ్యక్షులుగా MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది,సభా ప్రారంభం లో,ప్రభుత్వ జూనియర్ కళ శాల విద్యార్థులు, స్వాగత నృత్యం, జయ జయ ఓ తెలంగాణ జనిని కేతనం—- పాటతో విద్యార్థులు అనుకరించి నృత్యం చేశారు,

తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా, గోండు, గిరిజనుల, నృత్యాలు అలరించాయి, ఈ సందర్బంగా తెరాస ప్రజాప్రతినిధులుమాట్లాడు తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , తెలంగాణ జాతీయ 3 రోజుల వజ్రోత్సవాలు జరుపు కోవడం చాలా సంతోషం అన్నారు, ఆనాడు భారత దేశం బ్రిటీష్ తెల్లవాళ్ళ నుండి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యంభారత్ కు ,వచ్చిన కూడా తెలంగాణలో 20 జిల్లాల తో,రజాకార్లు 13 నెలలు ఇక్కడి ప్రజల మాన ప్రాణాలు ఆస్తులు దోచుకొని 4500 మందిని సజీవ దహనాలు హాత్యాలు చేశారు,

నాడు కేంద్ర హోమ్ మినిస్టర్ గా ఉన్న సర్ధార్ వల్ల భాయ్ పటేల్, ఆర్మీతో నావాబులను లొంగ తీసుకొని,తెలంగాణ విమోచన చేసినాడని తెలుపారు, ఈ రోజు తెలంగాణ కెసిఆర్ సీఎం కొత్త సచివాలయమునకు, మన రాజ్యాంగం వ్రాసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం ఎంతో గర్వవించదగ్గ విషయ మన్నారు, తాండూర్ కు మైనార్టీ గురుకులాలు, SC,గురు కులాలు, BC గురుకులాలు,30-00 ఎకరాలు వ్యవసాయ మార్కెట్ గురించి ఇచ్చారు,30 కోట్ల తో నర్సింగ్ కళ శాల, BC స్టడీ సర్కిల్, బై పాస్ రోడు, తాండూర్ కు 4 జీవోలు ఇచ్చారు,దేశం లో నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదన్నారు,ఇక పోతే కొంత మంది కులాల, మతాల మధ్య కొట్లాటలు చేయటానికి ముస్లీమ్ లని హిందువులని వేరు భంధం చూస్తున్నరన్నారు, ఈ సభ వేదిక పైన డాక్టర్ P. మహేందర్ రెడ్డి MLC . జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ . మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ పరిమళ . మున్సిపల్ వైస్ చైర్మన్ దీపానర్సిములు . తాండూర్ డివిజన్ RDO తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS