SAKSHITHA NEWS

Telangana government help for caste workers…

కులవృత్తులకు తెలంగాణ సర్కార్‌ చేయూత…

ఫాక్స్ సాగర్ లో 2.89 లక్షల చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ ఫాక్స్ సాగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ 2.89 లక్షల చేప పిల్లలను అధికారులు మరియు సొసైటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులకు తెలంగాణ సర్కార్‌ చేయూతనిస్తుందన్నారు. మత్య్సకారులు గతంలో అనేక సమస్యలతో సతమతం అయ్యేవారని.. కానీ ఇప్పుడు వారికి ప్రభుత్వం అండగా నిలిచి.. ఆర్థికంగా ఎదిగేలా కృషి చేస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. తెలంగాణలో చేప పిల్లల పంపిణీ జరుగుతోందని, దీంతో మత్స్యకారుల కష్టాలు తీరి.. వారు ఆర్ధికంగా ఎదుగుతున్నారని చెప్పారు.

సొసైటీ ఏర్పాటు చేసి.. మత్య్సకారులకు హక్కులు కల్పించిన ఏకైక ప్రభుత్వం తమదేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడక ముందు.. డబ్బులు పెట్టి చేప పిల్లలు కొనే స్థోమత లేక.. ఇబ్బందులు పడేవారని గుర్తుచేశారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 100 శాతం రాయితీతో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ పూర్ణిమ, జీడిమెట్ల ఫిషర్ మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చిలుకూరి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి యాదమ్మ, జనరల్ సెక్రటరీ మద్దూరి వీరేష్, డైరెక్టర్లు కావలి కృష్ణ, దమ్మని శ్రవణ్ కుమార్, మద్దూరి సత్యమ్మ, తాళ్ల వెంకటేశ్వరరావు, మన్నే శంకర్, అర్కల లక్ష్మణ్ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS