తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు షాపూర్ నగర్ ఎం.జె గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ మంచి నీళ్ళ పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ , కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.భాగంగా ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు,పాత్రికేయులు,వివిధ వర్గాల ప్రజలతో మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్స్,వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శించి,నీళ్లను శుభ్రపర్చుతున్న తీరును, ఇంటింటికి నీళ్ళు సరఫరా అవుతున్న తీరును వివరించారు.
జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించి, హైదరాబాద్ మహానగర మంచి నీటి మరియు మురుగు నీటి పారుదల మండలి వారి ఆధ్వర్యంలో జలమండలి జలప్రగతిని ఏ.వి రూపంలో వీక్షించి బుక్లెట్ ను ఆవిష్కరించారు.నియోజిక వర్గం పరిధిలో తొలుత మంచి నీళ్ల సమస్యలను ఎదుర్కొని,తరువాత మంచి నీటి సరఫరా,మరియు కనెక్షన్స్ పొందిన నియోజిక వర్గ ఆయా బస్తీ మరియు కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి నాడు నేడు అనుభవాలను తెలియజేశారు.సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో భయంకరమైన తాగు నీటి ఎద్దడి తీరును ప్రస్తావిస్తూ,మిషన్ భగీరథ ద్వారా ఆ సమస్యను పరిష్కరించిన విధానాన్ని అద్భుతంగా తెలియజేశారు.కుత్బుల్లాపూర్ నియోజీకవర్గంలో అందరికీ తాగు నీరు 530.18 కోట్లతో 472.79 కొత్త పైప్ లైన్ల నిర్మాణంతో 39.58 మిలియన్ లీటర్ల నీటి సామర్ధ్యం పెంపుతో ఇంటింటికి నల్లా కనెక్షన్,నాడు 2014 లో 58,862, నేడు 100,166 మంచి నీటి కనెక్షన్లు అందించామని,అదే విధంగా నీరు శుద్ధిగా ఉందా లేదా అని తెలుసుకొనుటకు క్వాలిటీ కిట్స్ ను అందించారు.
అనంతరం జలమండలి ఉత్తమ ఉద్యోగులకు,సిబ్బందికి సర్టిఫికేట్లు, మెమెంటో లు అతిథులు అందించారు.సంక్షేమంలో స్వర్ణయుగం,అభివృద్ధిలో అగ్రస్థానం తో ప్రజలకు జలమండలి కి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో మంచి నీళ్ళ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి జెనరల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి,ఇతర ముఖ్య అధికారులు,NMC కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కొంపల్లి మున్సిపల్ చైర్మన్, నియోజిక వర్గ ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు,యువ నాయకులు, మహిళా నాయకులు,వాటర్ వర్క్స్,ఇరిగేషన్ అధికారులు, మరియు సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.