మాదిగలకు మొండి చెయ్యి చూపిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Spread the love

ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న మాదిగ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహదారి దిగ్భంధం

మాదిగలంటే ఓట్లు వేసి యంత్రాలు కాదు – తిరగబడితే ఏ రాజకీయ పార్టీలు మనుగడలో ఉండవు

ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి మార్చుకో – ఎస్సీ రిజర్వ్ స్థానంలో మాదిగ అభ్యర్థులకు ఎంపీ టికెట్ కేటాయించి మాదిగల పట్ల చిత్తశుద్ధి చాటుకో

జోగులాంబ గద్వాల జిల్లా : గట్టు మండలంలోని తెలంగాణ కర్ణాటక అంతరాష్ట్ర రహదారి బల్గెర చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం గట్టు మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి నిరసనగా అంతరాష్ట్ర రహదారిపై సుమారు గంటపాటు బస్సులను ఆపి పూర్తిగా దిగ్బంధం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బల్గెర ఏసన్న మాదిగ,ఎమ్మెస్పీ జిల్లా సీనియర్ నాయకులు మిట్టదొడ్డి ఇమ్మనేలు మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ బండారు తూమ్ డేవిడ్ మాదిగ మాట్లాడుతూ….ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాదిగల పట్ల చేస్తున్న మోసాలకు నిరసనగా అంతరాష్ట్ర రోడ్డును దిగ్బంధం చేశామని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ మూడు స్థానాలలో మాదిగ అభ్యర్థులకు కేటాయించకుండా మాల అభ్యర్థులకు కేటాయించడం అంటే మాదిగలను మోసం చేయడమే అని అన్నారు.ఇకనైనా మాదిగల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వైఖరి మార్చుకోవాలన్నారు.లేదంటే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనియ్యబోమన్నారు.

ఈ కార్యక్రమంలో
బండారి డేవిడ్ తూము
Mrps జిల్లా కో కన్వీనర్,*మిట్ట దొడ్డి ఇమ్మనియేలు మాదిగ
MRPS సీనియర్ జిల్లా నాయకులు,బలిగేరా ముక్కారన్న
Mrps జిల్లా సీనియర్ నాయకులు,MG నరసింహులు
Mrps నాయకులు,సామెల్ బలిగేరా మాజీ సర్పంచ్ అరిగిద్ద తిమప్ప, అరిగిద్ద గ్రామ mrps అధ్యక్షులు,ఇందువాసి బీమ్మన్న
Mrps గట్టు మండల నాయకులు
సాకి సుదర్శన్ యెబు యోహాను అజయ్ రాజేష్ బజారి దుబ్బగాళ్ల దానియేలు తదితరులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page