మంత్రి కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు”

Spread the love

మంత్రి కాకాణి చేతులు మీదుగా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు”


సాక్షిత నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు పట్టణంలో ద్వారకామయి కళ్యాణ మండపంలో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలకు ప్రతిభ పురస్కారాలను అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి *

ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యా రంగానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వము, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి, విద్యారంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది అన్న మంత్రి కాకాణి.

..పదవ తరగతి తర్వాత అనేకమంది విద్యార్థినీలు చదువులు సగంలోనే నిలిపివేస్తున్నారు. కోరమాండర్ స్కాలర్ షిప్ లు విద్యార్థినీలకు ఎంతగానో ఉపయోగపడతాయి..
ప్రతిభ పురస్కారాలకు ఎన్నికయ్యేందుకు మీ తల్లిదండ్రులు, గురువులు అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్న మంత్రి కాకాణి.*
నేటి విద్యార్థులు బాగా చదువుకోగలిగితే అదే ఈ దేశానికి పెట్టుబడి అని వివరించిన మంత్రి కాకాణి.*
సిఎస్ఆర్ పథకం ద్వారా ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించడం అభినందనీయమని పేర్కొన్న మంత్రి కాకాణి.*

మేజర్లు అయిన తర్వాత ఆకర్షణలకు లోనై జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఏరోజు మర్చిపోవద్దని సూచించిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి*
ఈ సమాజంలో తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని బతకాలనుకునే పిల్లలు పనికిరారని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని పేర్కొన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.


తల్లిదండ్రుల రుణాన్ని ఏ పిల్లలు కూడా తీర్చుకోలేరని ..తల్లిదండ్రులు బాధపడే పనులు చేసే పరిస్థితిని నేటి విద్యార్థిని విద్యార్థులు తీసుకురాకూడదని సూచించిన మంత్రి కాకాణి.*
నేటి విద్యార్థులు అన్నదాత కష్టం విలువ తెలుసుకోవాలి… అన్నదాత లేకపోతే మనం మూడు పూటలా తిండి కూడా తినలేమని, లాల్ బహుదూర్ శాస్త్రి ఎప్పుడో జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారని గుర్తు చేసిన మంత్రి కాకాణి.*
విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేసి, నేటి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని వివరించిన మంత్రి కాకాణి*

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page