SAKSHITHA NEWS

సబ్ కి యోజన -సబ్ కా వికాస్ 2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక(DPDP) తయారిపై నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్

2024-2025 సం. నకు జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP) తయారిపై
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి
జిల్లా పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ సూచించారు.ఆదిలాబాద్ లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (DPDP)తయారిపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సభ్యులు సూచించిన సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జడ్పీ చైర్మన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు మల్లెపూల నర్సయ్య , అడ్షిత పవార్ ,R సంధ్య రాణి , పతాంగ్గీ బ్రహ్మాండ , కదం సుభద్ర బాయి , అరుంధతి తుమ్మల్ల ,నల్ల వనిత , గోక గణేష్ రెడ్డి , కో ఆప్షన్ మెంబర్ అంజత్ , తహేర్ బీన్ సలం , సీఈఓ గణపతి , డిప్యూటి సీఈఓ రాజేశ్వర్ , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 25 At 4.00.08 Pm

SAKSHITHA NEWS