Studied Ten.. Dr. Giri did.. Shankar Dada MBBS there!!
సాక్షిత వరంగల్: పదో తరగతి చదివి,ఎంబిబిఎస్ చదివిన డాక్టర్ లా చలామణి అవుతున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ లను వరంగల్ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు.నకిలీ సర్టిఫికెట్ లతో వరంగల్ నగరంలో గత 25 సంవత్సరాలు వైద్యులుగా చలామణి అవుతున్న ఇద్దరు నకిలీ డాక్టర్లను వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మరియు మట్వాడా, ఇంతేజార్ గంజ్ పోలీసులు సంయుక్తంగా కల్సి అరెస్ట్ చేసారు.
నకిలీ సర్టిఫికెట్ లతో డాక్టర్ దందా..వరంగల్ లో ఇద్దరు నకిలీ వైద్యులు
ఈ నకిలీ డాక్టర్ల నుండి రెండు నకిలీ వైద్యవిద్య సర్టిఫికెట్ లతో పాటు ఒక లక్ష 28వేల రూపాయల నగదు,డాక్టర్ల క్లినికలకు నిర్వహణకు సంబంధించిన పరికరాలు,మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ అరెస్టు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు.వరంగల్, హంటర్ రోడ్ ప్రాంతానికి చెందిన నకిలీ వైద్యుడు ఇమ్మడి కుమార్ పదో తరగతి పూర్తి చేశాడు, వరంగల్ చార్ బౌళి ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ పదవతరగతి కూడా ఫెయిల్ అయ్యాడు.వీరు ఇద్దరూ మిత్రులు కావడంతో పాటు గతంలో 1997 సంవత్సరానికి ముందు నగరంలో ప్రముఖ డాక్టర్ల వద్ద సహయకులుగా చాలా సంవత్సరాల కాలం పనిచేసారు.
వరంగల్ లో క్లినిక్ లను తెరిచి వైద్యం చేస్తున్న నకిలీలు
వీరు ఇద్దరికీ సహయకులుగా చాలా కాలం పనిచేయడం ద్వారా వైద్యం చేయడంలో అనుభవం రావడంతో వీరు సైతం డాక్టర్లుగా చలామణి అయి పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించాలకున్నారు. ఇందుకు కోసం నిందితులు బిహార్ రాష్ట్రంలోని దేవఘర్ విద్యాపీర్ విశ్వవిద్యాలయము నుండి ఆయుర్వేద వైద్యంలో డిగ్రీ పూర్తి చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్ లా తో పాటు గుర్తింపు కార్డును ఐదు వేల రూపాయలకు కోనుగోలు చేసారు.సంపాదించిన సర్టిఫికెట్ల సహయంతో నిందితుల్లో ఒకడైన ఇమ్మడి కుమార్ క్రాంతి క్లినిక్ పేరుతో కొత్తవాడలో వైద్యశాలను నిర్వహిస్తుండగా,మరో నిందితుడు రఫీ సలీమా క్లినిక్ పేరుతో చార్ బౌళి ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా వైద్యశాలలను నిర్వహిస్తున్నారు.
రోగాలతో వచ్చే పేదలను అందిన కాడికి దండుకుంటున్న నకిలీ వైద్యులు
డాక్టర్ సహయకులుగా పనిచేసిన అనుభవంతో నిందితులు తమ వైద్యశాలకు సాధారణ రోగాలతో వచ్చే రోగులకు చికిత్స అందిస్తూ రోగుల వద్ద పెద్ద మొత్తంలో ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసేవారు. ఒకవేళ రోగులు వ్యాధి తీవ్రత అధికంగా వుంటే నగరంలోని కార్పోరేట్ హస్పటల్స్ కు వెళ్ళమని సూచించేవారు. నిందితులు నిర్వహించే వైద్యశాలలోనే మందులు దుకాణంతో పాటు రక్తపరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసి వారి నుండి కూడా పెద్ద మొత్తం కమీషన్లు తీసుకోనేవారు. నిత్యం నిరుపేదలను టార్గెట్ చేసి వారికి వైద్యం పేరుతో ఫీజులు తీసుకునేవారు.
క్లినిక్ లపై దాడులు చేసిన టాస్క్ ఫోర్స్..నకిలీ వైద్యుల గుట్టు రట్టు
ఈ నకిలీ డాక్టర్ల బాగోతం కాస్తా టాస్క్ ఫోర్స్ పోలీసులకు తెలియడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానికి మట్వాడా, ఇంతేజార్ గంజ్ పోలీసులు మరియు వరంగల్ రిజినల్ ఆయుష్ విభాగానికి చెందిన వైద్యుల అధ్వర్యంలో ఈ నకిలీ డాక్టర్లు నిర్వహిస్తున్న వైద్యశాలలపై దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులు తాము పాల్పడుతున్న నేరాన్ని పోలీసుల ఎదుట అంగీకరించారు.ఈ కేసులో 25 సంవత్సరాలుగా క్లీనిక్ నిర్వహిస్తూ నకిలీ డాక్టర్ వైద్యం చేస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎవరు గుర్తించకపోవడం కొసమెరుపు.