తెలంగాణ యువతకు స్టేట్ పోలీస్ కీలక హెచ్చరిక

Spread the love

హైదరాబాద్ :
ప్రైవేట్ వాహనాలకు సైరన్లు వాడటం చట్ట రీత్యా నేరమని తెలంగాణ స్టేట్ పోలీస్ ఇవాళ ట్వీట్ చేసింది.
రాష్ట్రంలో కొందరు యువకులు తమ వాహనాలకు సైరన్లు బిగించి అదొక ఘనకార్యంగా భావిస్తారని, సైరన్ల వాహనాలతో పోలీసులకు పట్టుబడ్డప్పుడు అత్యంత కఠిన చర్యలు తీసుకోవడానికి వెనకాడరని హెచ్చరించింది.
సమాజం పట్ల బాధ్యతగల తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలని తెలిపింది.
మైనర్లకు కార్లు, బైక్‌లు ఇవ్వడం నేరంతో పాటు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తున్నదని పేర్కొంది.
మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు అతనికే కాదు.. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడి కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలని సూచించింది..

Related Posts

You cannot copy content of this page