శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చిన మైనార్టీ కుటుంబ సభ్యులు

Spread the love

సాక్షిత :

చుట్టం చూపుగా ఎన్నికల సమయంలో వచ్చే నాయకుడు మాకు వద్దు, కరోనా కష్టకాలంలో మాకు అండగా నిలిచి ధైర్యం చెప్పి మా కడుపు నింపిన నాయకుడికే మా మద్దతు – ముస్లిం సోదరులు

ముస్లిం సోదరుల ప్రేమ వెలకట్టలేనిది,జగనన్న పాలనలోని మైనార్టీలకు న్యాయం – MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి

  • ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 100 ముస్లిం కుటుంబాలు

శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, పద్మా నగర్, బుగ్గ వీధి, అల్లిమిట్ట, బాలాజీ నగర్,పాంచాలి నగర్ కు చెందిన 100 మైనారిటీ కుటుంబ సభ్యులు సుమారు 300 మంది ఈరోజు ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి,జిల్లా మైనార్టీ ప్రెసిడెంట్ రసూల్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన వారు రఫీ, సలీం, చాంద్ బాషా, చాందిని, రష్మ, షబ్బీర్, మెహబూబ్ భాష, ఇబ్రహీం ,రసూల్ భాషా, లతీఫ్, గౌస్ బాషా , షావాలి, మస్తాన్ ,షబ్బీర్, అబ్దుల్, అహ్మద్, ఆసియా, ఇమ్రాన్, మహమ్మద్ అలీ, షాకీర్, షకియా, భావాజాన్, షమీర్ భాష, కౌషియ, అహ్మద్, అబ్దుల్, ఫరూక్, ఖలీల్, వహీదా, జీనాథ్, షన్ను, సానియా, రేష్మ, మొహమ్మద్ అలీ, అమ్ములు ,గౌసియా, దిల్షాద్, నూర్జాన్, రషీదా, షాజాది తదితరులకు పార్టీ కండువా కప్పి సాధారణ వైయస్సార్సీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గం లో గత 30 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి కేవలం తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి సారి (కరోనా రెండు సంవత్సరాలు పోను) మిగిలిన మూడు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని,అలాగే మా ముస్లిం కుటుంబాలకు కూడా పెద్దపీట వేస్తూ పెళ్లి చేసుకునే ముస్లిం పెళ్లి కుమార్తెకు మేనమామ సంగ్యమ్ పేరుతో డబల్ కాట్ మంచము,బీరువా, ఫ్రిడ్జ్ ,టీవీ మొదలైనవి అందజేస్తున్నారని అలాగే కరోనా సమయంలో గత 30 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిని పాలించిన టీడీపీ వాలు మమల్ని గాలికి వదిలేసినా కూడా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి కోడిగుడ్లు, కేజీ చికెన్,బాస్మతి రైస్, నిత్యవసర సరుకులు, కూరగాయలు, అలాగే రంజాన్ పండుగ సందర్భంగా ఆడపడుచు ఒక చీర ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారని తెలిపారు. శ్రీకాళహస్తిలో ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించినా రానున్న ఎన్నికల్లో గత మెజార్టీ కంటే బంపర్ మెజార్టీతో మధుసూదన్ రెడ్డిని అఖండ గెలుపుకి మైనార్టీల అందరం కష్టపడి పని చేస్తామని… రానున్న ఎన్నికలకు మైనార్టీ కుటుంబ సభ్యులందరూ సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రమేష్, టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వైస్ ఎంపీపీ సుజాత, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ రఫీ, సర్పంచ్ నగేష్,వార్డు మెంబర్ ఇరానీ ఖాదర్, ఎలక్ట్రికల్ మాబా, కో ఆప్షన్ నెంబర్ అస్సాం సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page