విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

Spread the love

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

ఎన్టీఆర్ జిల్లా

జి.కొండూరు జెడ్పి హైస్కూలు విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఇందుకోసం శాసనసభ్యులు కృష్ణప్రసాదు తన స్వంత నిధులను వెచ్చించారు. బ్యాడ్మింటన్ బ్యాట్లు, 70 జతల స్పోర్ట్స్ వేర్, వాలీబాల్స్, టేబుల్ టెన్నిస్ బోర్డు కిట్, నెట్, ఇతర క్రీడా సామాగ్రిని అందజేశారు. విద్యార్థిని, విద్యార్థులకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింత రాణించి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి తీసుకురావాలని ఆకాంక్షించారు. పిల్లల కోసం అడగగానే స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చిన శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్ కి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page