తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం”లో భాగంగా ముస్లీం సోదరుల ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ ఎంజె గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా “తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం” సందర్భంగా ముస్లీం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ముస్లీం సోదరులకు ఏ సహాయ సహకారానికైనా ముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముస్లీం పెద్దలు, ఇమాం, మౌజంలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.