చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

Spread the love

Small Kaleshwaram project should be completed soon

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి..

ప్రాజెక్టు వల్ల నష్టపోయినా రైతుల ఆదుకోవాలి …

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి

సాక్షిత న్యూస్, మంథని:

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కాలేశ్వరం, కన్నపెల్లి, బీరసాగర్ గ్రామాలలో సునీల్ రెడ్డి ఇంటి ఇంటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. గ్రామ లలో జెండాలను ఆవిష్కరణ చేస్తూ, బైక్ ర్యాలీ లు తీశారు. కన్నె పల్లి గ్రామం లో సుమారు 50 యువకులు సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు.

అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోని కీలకమైన కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణం కొరకు కన్నపెల్లి గ్రామంలోని రైతులు తమ విలువైన భూములను ఇచ్చారు. ఎకరానికి ఐదు లక్షలు నష్టపరిహారం చెల్లించి తమ భూములను లాక్కొని రైతులను విస్మరిస్తున్న ఈ ప్రభుత్వం ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటారం మహాదేవపూర్ మలహర్, మహ ముత్తారం మండలాల్లోని సుమారు 40000 ఎకరాలకు సాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిన్న కాలేశ్వరం ఎత్తిపోతల పథకం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు నిర్మించకపోవడం శోచనీయమని అన్నారు. తక్షణమే త్వరితగతిన చిన్న కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి, యాత్ర ప్రముఖ్ వెన్నం పెల్లి పాపయ్య, మంథని నియోజకవర్గ ప్రబరి కాటంగురి అనిల్ రెడ్డి, మండల అధ్యక్షుడు సిరిపురం శ్రీమన్నారాయణ, యాత్ర సహ ప్రముఖ్, దుర్గం తిరుపతి, మండల ఇంచార్జ్ ఉడుముల విజయ రెడ్డి, వివిధ మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మల్కా మోహన్ రావ్, పిలుమరి సంపత్, పార్లమెంట్ ఐటీ సెల్ కన్వీనర్ భీమారపు సంపత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్, మండల ప్రధాన కార్యదర్శిలు బొల్లం కిషన్, సూరం మహేష్, మంథని రాజేందర్, గంట అంకన్న, పూసల రాజేంద్రప్రసాద్, మేడిపల్లి పూర్ణచందర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page