గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు మరియు సాధారణ భక్తులు అంజన్న దర్శనానికి వస్తున్నారు. కాలినడకన వచ్చే భక్తులకు జగిత్యాల పట్టణానికి చెందిన మూసిపట్ల వెంకట రమణయ్య, వెంకట లక్ష్మీ జ్ఞాపకార్థం వారి కుమారుడు, జయశ్రీ ప్రింటర్స్ అధినేత మూసిపట్ల దేవేందర్, వారి సతీమణి భాగ్యలక్ష్మి, కూతురు కౌముది లు త్రాగునీరు, అరటిపండ్లు, మజ్జిగ ను భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం తో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం చిన్న జయంతి మరియు పెద్ద జయంతి సందర్భంగా సేవ చేస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా త్రాగునీరు, అరటిపండ్లు, మజ్జిగ ను అందిస్తుండటం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు
Related Posts
అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ జెడ్పీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డిని మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి నూతన…
అదనపు కలెక్టర్ లత కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్
SAKSHITHA NEWS అదనపు కలెక్టర్ లత కి శుభాకాంక్షలు తెలిపిన చైర్పర్సన్. జగిత్యాల:- జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ . అదనపు కలెక్టర్ బి ఎస్ లత వారి కార్యాలయంలో మర్యదపూర్వకంగా కలిసి స్వీట్స్ అందించి…