శంకర్‌పల్లి మండల ఉపాధ్యక్షుడిగా బండమీది వెంకటేష్

Spread the love

శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడిగా మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటేష్ నియమితులయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ళ రాములు గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రత్నం, మండల, మున్సిపల్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. చేవెళ్ల గడ్డపై కొండ విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించి కాషాయ జెండాలు ఎగరవేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు శశికాంత్ రెడ్డి, హరినాథ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కృష్ణ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page