269 ఎకరాలు భూసేకరణ చేస్తామని చెప్పి, 163 ఎకరాలకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యం
సాక్షిత : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో సింగరేణి ఓసీపీ 5 ప్రాజెక్టు కోసం గ్రామంలో 269 ఎకరాలు సేకరించారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం భూ సేకరణ విషయంలో వివిధ కారణాలతో రైతులను ఇబ్బంది పెడుతూ కాలయాపన చేస్తూ. రైతులకు ఆశ పెడుతూ సింగరేణి యాజమాన్యం తన పనులు నిర్వహిస్తూ ప్రాజెక్టును మొదలుపెట్టింది. కానీ రైతులకు పరిహారం ఇవ్వడంలో జాప్యం కావడంతో 106 ఎకరాల్లో ఉన్న రైతులు కోర్టును ఆశ్రయించి స్టే ఆడర్ తీసుకువచ్చారు.
దీంతో ఆ 106 ఎకరాల్లో సింగరేణి యాజమాన్యం పనులు నిలిపివేశారు. మీద 163 ఎకరాల్లో ప్రాజెక్ట్ నిర్వహించడానికి రైతులకు పరిహారం ఇస్తామని చెప్పి డిక్లరేషన్ ఫామ్ మీద భూ నిర్వాసితుల సంతకాల సేకరించి మీకు చెక్కులు తయారు చేసాము రేపో మాపో ఇస్తామని చెప్పి మీ భూములపై విజిలెన్స్ కు ఎవరో ఫిర్యాదు చేశారని పరిహారం ఇవ్వడానికి ఇలాంటి కొర్రీలు చెబుతూ సింగరేణి యాజమాన్యం కాలియాపన చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భూ దళారుల ఫిర్యాదుతో రైతులను ఇబ్బంది పెడుతున్న సింగరేణి గ్రామంలోని కొన్ని భూములను కొంతమంది భూ దళారులు సింగరేణి ప్రాజెక్టు లో భూ పరిహారం కింద లక్షల్లో డబ్బులు వస్తాయని ఇతర ప్రాంతాల్లోని కొంతమందికి బడా బాబులకు లేని నకిలీ పత్రాలు తయారుచేసి భూములను విక్రయించారు.
ప్రాజెక్టు కోసం సింగరేణి యాజమాన్యం భూసేకరణ చేపట్టింది.రెవెన్యూ సింగరేణి అధికారులు చేపట్టిన సర్వేలో దళారుల చేతిలో మోసపోయిన కొంతమంది పేర్లు సర్వేలో లేకపోవడంతో భూములు తీసుకున్న వ్యక్తులు అమ్మిన వ్యక్తుల దగ్గరికి వెళ్లి దబాయించడంతో ఈరోజు దళారులు అమ్మిన భూముల్లోని బినామీల కోసం గ్రామ రైతుల పరిహారం రాకుండా చేసి దళార్లు సింగరేణి అధికారులు కుమ్మక్కై దళారులతో ఫిర్యాదు చేపించి సింగరేణి యాజమాన్యం పరిహారం ఇవ్వకుండా ఇదొ సాకుగా ముందు పెట్టి పరిహారం ఇవ్వడంలో రైతులను ఇబ్బంది పెడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు.
పరిహారానికి అడ్డంకులు చెబితే మా భూములు మాకు ఇవ్వండి.
భూముల ను కొలు పోయి నాలుగున్నర సంవత్సరాలుగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రైతులను దళారుల ఫిర్యాదు ను పరిగణలోకి తీసుకొని పరిహారం ఇవ్వడంలో అడ్డంకులు చెబుతున్న సింగరేణి యాజమాన్యం ప్రాజెక్టు నిర్వహిస్తున్న మా భూములను మాకే ఇవ్వండి అని రైతులు చెప్తున్నారు. భూ సేకరణ చేసే విషయంలో దళార్లకు సింగరేణి లోని కొంతమంది అధికారులకు ఏమైనా స్నేహబంధాలు ఉన్నాయా?….డిక్లరేషన్ తీసుకున్న తర్వాత పరిహారం ఇవ్వడంలో అడ్డంకులు సృష్టిస్తున్నారు. మా భూములు మాకు ఇవ్వండి అని రైతులు సింగరేణి యాజమాన్యాన్ని అల్టిమేట్ జారీ చేశారు.
సమస్య పరిష్కరించకుంటే తీసుకున్న మా భూములలో నాగన్లేసి రోడ్డుతో సహా దున్నుతామని హెచ్చరించిన రైతులు..పరిహారం ఇవ్వడంలో సింగరేణి యాజమాన్యం వివిధ కారణాలతో రైతులను ఇబ్బంది పెడుతూ భూములు తీసుకొని సాగు లేకుండా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం.
సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమ కోసం ఎన్నో విధాలుగా అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా మేము తీసుకోకుండా ప్రాజెక్టు కోసం భూములు ఇస్తే ఈరోజు దళారుల కోసం మా పరిహారం ఆపడం సింగరేణి యాజమాన్యం కు సబబు కాదని అన్నారు.ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నిర్మాణ కోసం మా భూములు తీసుకున్న సింగరేణి యాజమాన్యం రెండు రోజులలో సమస్యను పరిష్కరించకుంటే మా భూములలో నాగండ్లు వేసి రోడ్డుతో సహా మా భూముల్లో దున్నుతామని రైతులు హెచ్చరించారు.
,,,,,,,,,,,,,,,,,