బిఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్

Spread the love

బిఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్
ఎన్నికల వేళ పార్టీ మారుతున్న నాయకులు: భీం భరత్ సమక్షంలో చేరికలు

సాక్షితశంకర్‌పల్లి: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయని చేవెళ్ల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ అన్నారు. తాజాగా శంకర్‌పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పొట్టాన్ని పొడుగోడు పొడుగోన్ని కొడితే.. పోశమ్మ కొట్టిందట.. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, నాయకులను పార్టీలో చేర్చుకొని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బకొట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అదే గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందని భీమ్ భరత్ అన్నారు.

ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరో వైపు బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలతో పాటు గతంలో కాంగ్రెస్ లో ఉన్న నాయకులంతా తిరిగి సొంతగూటికి చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేరికలకు సంబంధించి గేట్లు తెరవడంతో బీఆర్ఎస్ నేతలు, నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో చేరిందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆలంఖాన్ గూడ మాజీ సర్పంచ్ లు సౌమ్య వెంకటేష్, అనంత్ రెడ్డి లు భీం భరత్ సమక్షంలో తమ అనుచరులు 50 మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా భీం భరత్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భీం భరత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకంతో, అదే విధంగా తన మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్న వారికి స్వాగతం అంటూ ఆయన వ్యాఖ్యానిస్తూ, పార్టీలో చేరుతున్న నాయకులు పాత కొత్త వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని ఇంకా బలోపేతం చేయాలని, అదే విధంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ చేరికల కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్, బుచ్చిరెడ్డి, కృష్ణ, వెంకటయ్య, జైపాల్, కిషోర్, రామచందర్, రఘు, భరత్, శ్రీకాంత్, ప్రభాకర్, నర్సింలు, కిష్టయ్య, గోపాల్, శ్రీకాంత్, చందు, నితీష్ ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page