భక్తులతో పోటెత్తిన శివాజీ నగర్ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం

Spread the love

Shivji Nagar Umarudra Koteswara Temple thronged with devotees

భక్తులతో పోటెత్తిన శివాజీ నగర్ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం….
ఆలయాల్లో మార్మోగిన శివనామస్మరణ

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో గల శివాజీ నగర్ లో శ్రీ ఉమరుద్ర కోటేశ్వర ఆలయంలో శివ నామస్మరణతో మార్మోగింది..ఓం నమఃశివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆది దేవుడిని పూజించారు..తెల్లవారు జామునుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు.స్వామి వారికి అర్చకులు కుమార స్వామి అధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు,రుద్రాభిషేకాలు నిర్వహించారు..

వందల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు.ఉచిత దర్శనం తో పాటు 10 రూపాయలు ప్రత్యేక దర్శన సదుపాయాన్ని దేవస్థానం వారు కల్పించారు.భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page