SAKSHITHA NEWS


She was the first woman in Tirupati to sweep a broom with her hand holding a steth

స్టెత్ పట్టిన చేత్తో కుంచె పట్టిన తిరుపతి నగర తొలి మహిళ

సాక్షిత : * వృత్తి..ప్రవృత్తి..ఆసక్తి.. ఇలా ఎన్నో రూపాలలో సేవలందిస్తున్న తిరుపతి నగర తొలి మహిళ మేయర్ డాక్టర్ శిరీష కుంచె పట్టి బొమ్మలేసారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె రాజకీయ అరంగేట్రంతో మేయర్ గా సేవలందిస్తున్నారు. నగర నిర్మాణం, అభివృద్దిలో తనదైన ముద్రను వేస్తూ ప్రభుత్వ ప్రోత్సాహం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సహకారంతో నగర సుందరీకరణకు నగిషీలు చెక్కుతున్నారు.

ఆధ్యాత్మిక నగరంలో యాత్రికులను ఆకర్షించే విధంగా ప్రజలకు ప్రశాంతతను కలుగజేసే విధంగా పెయింటింగ్స్ వేయిస్తున్నారు. బ్యూటిఫికేషన్ లో భాగంగా ప్రముఖ మార్గాలలో ఉన్న గోడలకు కుడ్యచిత్రాలు ఏర్పాటు చేసారు. పలు గోడలకు పురాణ ఇతిహాసాలు, అందమైన కళారూపాలతో పెయింటింగ్స్ వేయిస్తున్నారు.

ఈ క్రమంలో ఆర్ సి రోడ్డులోని అండర్ బ్రిడ్జి గోడలకు వేయిస్తున్న పెయింటింగ్స్ ను ఆమె పరిశీలించారు. కళారూపాలతో చేతులు కలుపుతూ కుంచె చేత పట్టి తుది మెరుగులు దిద్దారు. కళాకారులను ప్రోత్సహించారు.


నగర పాలక సంస్థ ఆశయాలను పెయింటర్స్ కు తెలియజేసి అందమైన చిత్రాలను వేయాలని సూచించారు..
ప్రజలతో మమేకమై..ప్రజల సేవకై పని చేస్తున్న మేయర్ కుంచె చేతపట్టిన చిత్రం కార్మికులకు ప్రోత్సాహకంగా మారింది.


SAKSHITHA NEWS