రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ …
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ 21వ వార్డులో ఈరోజు రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సి.సి.రోడ్డు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్లతో కలిసి *దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ * శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఎల్లవేలలా కృషి చేస్తానన్నారు. మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువస్తానని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తామన్నారు. అనంతరం వార్డులో పర్యటించి ప్రజా సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అనంత స్వామి, శంభీపుర్ క్రిష్ణ, మాదాస్ వెంకటేష్, ఎంబరి లక్ష్మి ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఎంబారి ఆంజనేయులు, శామీర్ పేట హనుమంత్ రావు, మునిసిపల్ మహిళ అధ్యక్షులు మనోజ సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ అమర్, 24,21వ వార్డు ప్రెసిడెంట్లు గండిగుడెం రమేష్, మాదాస్ నవీన్, మాజీ వార్డు సభ్యులు విజయ్ కుమార్, బాలకృష్ణ, నాయకులు శామీర్ పేట ప్రేమ్ కుమార్, రాఘవ రెడ్డి, నర్సింగ్, శ్రీకాంత్, విఠల్, సురేష్, రమేష్, బిక్షపతి, జీ.రమేష్, రాజు దుసకంటి, అరుణ్, బబ్లూ, మరియు మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..