ఒక్కరోజే ఏడుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య

Spread the love

మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 40 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య.

ఇంటర్మిడియెట్ పరీక్షల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఫెయిలైన ఏడుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడగా, ఫెయిలవుతాననే భయంతో సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం పతూరు గ్రామానికి చెందిన ఒకేషనల్ ఫస్టియర్ విద్యార్థిని శ్రీజ ఫెయిలైతే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణం పొందింది.

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్ (17), హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన హరిణి, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు

దీంతో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Related Posts

You cannot copy content of this page