బహుమతులు అందజేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు పొద్దర్ రేఖ
సాక్షిత మెదక్ ప్రతినిధి:
మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ను పాఠశాల ప్రధానోపాధ్యా యులు పొద్దర్ రేఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులతో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు.ఈ స్వయం పరిపాలన దినోత్సవం లో జిల్లా కలెక్టర్ గా గీతికా,డిఇఓ గా మెహెక్,ఎంఈఓ భాను, డిఎస్వో గా సాయి వర్ణికా,నోడల్ అధికారిగా శ్రావ్య, స్పెషల్ ఆఫీసర్ గా తూర్పు భవాని, ప్రధాన ఉపాధ్యాయులుగా పల్లవి, ఉపాధ్యాయులుగా ఇంగ్లీష్ అక్షయ,హిందీ అధ్యపకురాలు గా మడూరి దివ్య, బయాలజీ సోషల్, అధ్యపకురాలుగా హన్సిక, సైన్స్,సద్గుణ,నిఖిత హిందీ, తెలుగు శివాని,లహరి
ప్రవళిక,శ్రీహర్ష సాంఘిక శాస్త్రం,గణితం అధ్యపకురాలు గా తన్విర్,స్పందన, ఫిజిక్స్, లో వనజ ,అమ్రీన్ తో పాఠశాల లో విద్యార్థుల కు పాఠాలు బోధించి తమ ప్రతిభను కనబరిచారు.ఇందులో ఉత్తమ బోధన చేసిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్య క్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు సంతోషిని, అరుణ, లావణ్య, పుష్పాలత, హేమలత, కేశవి,అస్మా, స్వప్న తో పాటు సిబ్బంది ఉన్నారు.