సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు

Spread the love

సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ లో సివరేజ్ వ్యవస్థను ఆధునికరిస్తున్నామని, సివరేజ్ పైప్ లైన్ ల ఏర్పాటు పూర్తి చేసిన వెంటనే రోడ్ల పునర్నిర్మాణం పనులు చేపడతామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. రాత్రి చింతబవి లో దాదాపు రూ.70 లక్షల ఖర్చుతో చేపడుతున్న సివరేజ్ పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చింతబవి ప్రాంతాన్ని సమస్యల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. మెట్టుగూడ డివిజన్ కార్పొరేటర్ రాసురి సునీత మాట్లాడుతూ స్థానిక సమస్యల పై వెన్వెంటనే స్పందిస్తున్నామని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చొరవ కారణంగా డివిజన్ అభివృద్ధి కి పుష్కలంగా నిధులు సాధించు కుంటున్నామని తెలిపారు. బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు జలమండలి డీ జీ ఎం సరిత, అధికారులు నిఖిత, విశ్వ తేజ తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page