ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు ..!!!
విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన యువకుడు చంద్రశేఖర్(32) అనంతలో కాలకు చేరాడు. ఇద్దరు సోదరులు, మరో ఇద్దరితో కలిసి అతను సింగ్ నగర్లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు చేర్చాడు. తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా కాలు జారి వరదలో కొట్టుకుపోయాడు. ప్రస్తుతం అతని భార్య 8 నెలల గర్భిణి.