SAKSHITHA NEWS

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది.

ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు మూసేయడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గింది.

ప్రస్తుతం 1,87,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

మరోవైపు బుడమేరు వాగుకు గండ్లు పూడ్చేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.