SAKSHITHA NEWS

Satthupalli MLAs Sandra Venkataveeraiah along with District Collector Gautham

జిల్లా కలెక్టర్ గౌతమ్ ని కలిసి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

పెనుబల్లి మండలం, రామచంద్రాపురం గ్రామంలో ఆదివాసుల పోడు భూములను అక్రమంగా ఆక్రమించుకొని బినామీ పేర్లతో ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసుల యొక్క భూములను సుమారు 9 మంది ఆదివాసుల పేర అటవీ హక్కుల పత్రాలు చేయించుకొని సుమారు 72 మంది పోడు రైతుల భూములను అన్యాక్రాంతం చేసిన వ్యక్తి పై తగిన విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ఆదివాసీలతో, నాయకులతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ ని కలిసి కోరారు.

ఈ ఆదివాసీలకు అటవీ హక్కుల చట్ట ప్రకారం 1980 నుంచి ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నటువంటి 72 మంది రైతులకు 74 ఎకరాలకు సంబంధించిన భూమిని సమానంగా పంచి వ్యక్తిగత హక్కు పత్రాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

నిరక్షరాసులమైన ఆదివాసులను పోడు భూముల విషయంలోనూ రెవిన్యూ భూముల విషయంలోనూ అక్కడ జరిగిన అవకతవకలను న్యాయం చేయుట కోసం ప్రత్యేకించి కేవలం అక్కడ ఉన్న ఆదివాసుల కోసం మాత్రమే ప్రత్యేక గ్రామసభను తక్షణమే ఏర్పాటు చేయాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ని కోరారు.

అదేవిధంగా నియోజకవర్గంలోని మండలాల్లోని ఆయా గ్రామాల్లో రెవిన్యూ సంబంధిత సమస్యల గల ప్రజలతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా కలెక్టర్ ని కలసి పరిష్కరించవలసిందిగా కోరారు.


SAKSHITHA NEWS