SAKSHITHA NEWS

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 17వ వర్థంతి సందర్భంగా బాపట్ల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని చీలు రోడ్డు వద్ద గల ఆ మహనీయుని విగ్రహం వద్ద జరిగిన నివాళి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ..

ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ… వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో సామాన్య కుటుంబంలో జన్మించిన గౌతు లచ్చన్న స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఎన్నో ఉద్యమాలు జరిపారు. భారత దేశ చరిత్రలో వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ బిరుదు అందుకొన్న మహోన్నత వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న .

బడుగుబలహీన వర్గాల గొంతుక గా వారి అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసి వారి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.విలువలు, విశ్వసనీయతలే ఆభరణాలు గా నిబద్ధత గల రాజకీయాలు చేసిన వారు ఎందరికో స్ఫూర్తి, వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయసాధనకు కృషి చేద్దామని నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావూరి శ్రీనివాసరెడ్డి, మరీదు వెంకటేశ్వర్లు, ఇనగంటి గాంధీ,యోన,బాలకోటేశ్వరావు,తిరుపతిరావు,శ్రీను,బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS