Sant Sewalal Maharaj led his race on the right path to nearly 11 crore Banjaras in India.
సాక్షిత : తన జాతిని సన్మార్గంలో నడిపించి భారత్‌లోని దాదాపు 11 కోట్ల బంజారా లకు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవంగా మారారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతి వేడుకలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారని చెప్పారు. తెలంగాణ వస్తే అణగారిన వర్గాల అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు దక్కుతుందనడానికి సేవాలాల్ జయంతి ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడమేనని చెప్పారు.
ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం కోటి రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంజారా / లంబాడా వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని తాండాలను గ్రామ పంచాయితీలుగా మార్చి.. ‘మా తాండాలో మా రాజ్యం ’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం నెరవేర్చి, గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేయడం జరిగిందని చెప్పారు.
గిరిజన విద్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బంజారాల కోసం ఎంతో అద్బుతమైన భవనాన్ని బంజారాహిల్స్ లో నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు.