సిబిఐటి లో ఉచితంగా సీటు సంకూరు కీర్తన

Spread the love
Sankuru Kirtan who got free seat in CBIT

సిబిఐటి లో ఉచితంగా సీటు సంపాదించిన సంకూరు కీర్తన


కీర్తన ను ఘనంగా సన్మానించిన శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి


*సాక్షిత : * రంగా రెడ్డి జిల్లాషాద్ నగర్
ఎంసెట్ పరీక్ష ద్వారా బీటెక్ చదువు కొరకు సిబిఐటి (చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కళాశాలలో ఉచితంగా సీటు సంపాదించిన షాద్ నగర్ శ్రీనగర్ కాలనీకి చెందిన సంకూరు హేమలత నరేందర్ కూతురు విద్యార్థిని సంకూరు కీర్తనను శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పారాయణ మండలి అధ్యక్షులు స్వరాజ్ బాబు శాలువాతో సత్కరించి రూ. 5000 నగదును అందజేశారు.

అధ్యక్షులు స్వరాజ్ బాబు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మరియు షాద్ నగర్ పట్టణానికి పేరు తేవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డి. ఈ. ఓ. స్వరాజ్ బాబు, పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షులు సరాపు రమేష్ దంపతులు, ఎల్కూర్తి నారాయణ, బండ రి శంకర్, నక్క నర్సింలు, మరియు సురేష్ సభ్యులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page