సంక్రాంతి ముగ్గు సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం

Spread the love


Sankranti is a testament to three cultural traditions

సంక్రాంతి ముగ్గు సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం

తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి*


సాక్షిత : సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని తాడికొండ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరులోని సాయి ఆదిత్య పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.

తొలుత విద్యార్థులు అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పల్లె జీవనాన్ని, ఉనికిని ప్రతిబింబిస్తుందని, రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని తెలియజేశారు.

ప్రకృతిని గౌరవిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ మనిషి జీవితాన్ని కొనసాగించాలని.. సంక్రాంతి పండుగ ప్రకృతి పండుగ అని తెలిపారు. సాంస్కృతిక అంశాలు మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి, ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడుతాయని తెలియజేశారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థుకు బహుమతుల ప్రధానం చేశారు

Related Posts

You cannot copy content of this page