SAKSHITHA NEWS

హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌పై కేంద్ర ఎన్నికల ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడంతో నగర తదుపరి కొత్వాల్ ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ సస్పెన్స్‌కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హైదరాబాద్ నూతన సీపీగా సందీప్ శాండిల్యను నియమించారు.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నూతన సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది.

ముగ్గురు నగర కమిషనర్లు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు కార్యదర్శులతో పలువురు నాన్ కేడర్ ఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేసింది. వీరందరిని ఎన్నికల విధుల నుండి తొలగించింది.

బదిలీ వేటు పడిన 20 మంది అధికారుల్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఒకరు. సీపీ ఆనంద్‌పై బదిలీ వేటు పడటంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించడం అనివార్యంగా మారింది.

ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సీనియర్ ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్యను హైదరాబాద్ నూతన సీపీగా ప్రభుత్వం నియమించింది…

Whatsapp Image 2023 10 13 At 6.10.32 Pm

SAKSHITHA NEWS