Revenue employees met District Minister Mallareddy and Collector Harish under the direction of Tresa.
ట్రెసా ఆధ్వర్యంలో జిల్లా మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్ హరీష్ లను కలిసిన రెవెన్యూ ఉద్యోగులు.
—కలెక్టరేట్ లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు.
శామీర్ పేట్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా ) ఆధ్వర్యంలో మేడ్చల్ -మల్కాజ్గిరి జిల్లా రెవెన్యూ ఉద్యోగులు గౌరవ కార్మిక శాఖ మంత్రి శ్రీ సిహెచ్ మల్లారెడ్డి గారిని, కలెక్టర్ డా,,శ్రీ ఎస్.హరీష్ గారిని, అదనపు కలెక్టర్లు శ్రీ అభిషేక్ ఆగస్త్య, శ్రీ ఏనుగు నర్సింహా రెడ్డి గార్లను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కె గౌతమ్ కుమార్, జిల్లా అధ్యక్షులు పి. సుధాకర్, జిల్లా కార్యదర్శి వి.రామక్రిష్ణ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గారు, కలెక్టర్ హరీష్ గారి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిఆర్వో లింగ్యా నాయక్,కీసర, మల్కాజ్గిరి ఆర్డీవోలు ఎన్. రవి,ఈ.మల్లయ్య,ట్రెసా రాష్ట్ర కార్యదర్శి వాణి రెడ్డి, సంయుక్త కార్యదర్శి గోవర్ధన్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఎన్. రాజేశ్వర్ రెడ్డి,శ్రీమతి సంయుక్త, జిల్లా కార్యవర్గ సభ్యులు గౌరీవత్సల,మహిపాల్ రెడ్డి, భూపాల్, శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, తహసీల్దార్లు శ్రీమతి అహల్య,సరిత, ఎస్తేర్ అనిత, పద్మప్రియ,సంజీవ్ రావు,సత్యనారాయణ తదితరులు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.