చందానగర్ సర్కిల్ పరిధిలోని మహిళా సమాఖ్య సంఘాల రిసోర్స్ పర్సన్స్ (RP) ప్రతినిధులు పలు సమస్యల పై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగినది
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ మహిళ సంఘాల RP సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని,మీ ప్రతి సమస్యను సత్వర పరిష్కారంకు కృషి చేస్తామని , మీకు ఎల్లవేళలో అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల RP సభ్యులు తదితరులు పాల్గొన్నారు