SAKSHITHA NEWS

విజయవాడ – చెన్నై
మధ్య 25 సెప్టెంబర్ 2023 నుండి ప్రారంభంకానున్న రెగ్యులర్ వందే భారత్ రైలును
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24 సెప్టెంబర్ 2023న జెండా ఊపి ప్రారంభిస్తారు .
ఆంధ్రప్రదేశ్ తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్ రైలు.
• రెగ్యులర్ రైలు సర్వీసులోని అన్ని తరగతులలో టికెట్ బుకింగ్‌ ప్రారంభించారు.
భారతీయ రైల్వేల గర్వకారణమైన ఈ రైలు రెండు ప్రధాన దక్షిణాది రాజధానులైన విజయవాడ మరియు చెన్నైలను కలుపుతుంది. ముఖ్యంగా ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.
ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది.
చెన్నై నగరంలోని
పురట్చి తలైవర్ డా.ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో అనుసంధానించబడుతుందిమార్గ మధ్యంలో ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు మరియు రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతున్నది. రైలు ప్రయాణికులు రెండు దిశలలోని నగరాలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది. విజయవాడ మరియు చెన్నై మధ్య దూరాన్ని 6 గంటల 40 నిమిషాల స్వల్ప వ్యవధిలో పూర్తి చేయబడుతుంది. ముఖ్యంగా ఈ రైలు రేణిగుంట మీదుగా ప్రయాణిస్తూ రెండు రాష్ట్రాల నుండి యాత్రికులకు తిరుపతి ఆలయ పట్టణాన్ని సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది.
ఈ రైలు ఈ మార్గంలో విజయవాడ చెన్నై మధ్య అత్యంత వేగవంతమైన అనుసంధాన్నిస్తుంది.
ఈ రైలు 8 కోచ్‌లతో (7 AC చైర్ కార్ కోచ్‌లు & 1 ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌) 530 ప్రయాణీకుల సీట్ల సామర్థ్యంతో రూపొందించబడిoది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు సర్వీసులో ఉంటుంది. రెండు దిశలలో రైలు సర్విస్ యొక్క రైలు సమయాలు క్రింది విధంగా ఉన్నాయి:
రైలు నం. 20677
ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ – విజయవాడ స్టేషన్ రైలు నం. 20678
విజయవాడ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్
05:30
ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ 22:00

07:05/07:10 రేణిగుంట జంక్షన్ 20:05/20:10
08:39/08:40 నెల్లూరు 18:19/18:20
10:09/10:10 ఒంగోలు 17:03/17:04
11:21/11:22 తెనాలి జంక్షన్ 15:49/15:50
12:10 విజయవాడ 15:20
ఐ.ఆర్.సీ.టి.సీ. వెబ్‌సైట్ ద్వారా మరియు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ఛార్జీల పూర్తి వివరాలను తెలుసుకొనవచ్చు. క్యాటరింగ్ ఛార్జీలు ఐచ్ఛికం మరియు టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు ఎంచుకోవచ్చును. రైలు ప్రారంభం మరియు గమ్యస్థానం స్టేషన్ నుండి ఛార్జీలు క్రింది విధంగా ఉన్నాయి :
విజయవాడ నుండి ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ. సీ. చైర్ కార్ ఛార్జీ రూ. 1420 మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2630. అదేవిధంగా, ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ. సీ చైర్ కార్ ఛార్జీ రూ. 1320 మరియు ఎగ్జిక్యూటివ్ తరగతి ధర రూ. 2540. విజయవాడ నుండి ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీను మినహాయిస్తే ఏ. సీ. చైర్ కార్ ఛార్జీ రూ. 1135 మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2280. అదేవిధంగా, ఎమ్. జి. ఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీను మినహాయిస్తే ఏ. సీ. చైర్ కార్ ఛార్జీ రూ. 1135 మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2280.


SAKSHITHA NEWS