రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షుల జన్మదిన వేడుకలు..

Spread the love

Ramagundam Press Club President’s birthday celebrations.

రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షుల జన్మదిన వేడుకలు..

సాక్షిత గోదావరిఖని రిపోర్టర్

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు షేక్ జమిల్ హుస్సేన్ జన్మదిన వేడుకలను ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది.

అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రామగుండం ప్రెస్ క్లబ్ లో తన జన్మదిన వేడుకలను క్లబ్ సభ్యులతో జరుపుకోవడం చాలా ఆనందకరమని, నూతన ప్రెస్ క్లబ్ కు అధ్యక్షులుగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, తన తోటి జర్నలిస్ట్ మిత్రులకు ఎవ్వరికైనా ఎలాంటి సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకు వస్త్తే ఏ సమస్యనైనా తన సాయశక్తుల పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.

ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు ఐక్యమత్యంతో ఉండడంమే కాకుండా, వార్తలు సేకరించి నిజాలను బయట పెడుతూ, సమాజ శ్రేయస్సు కోసం పని చేయాలని సభ్యులకు పిలుపునిచ్చారు. జర్నలిస్టులకు సహాయం చేయడమే కాకుండా అన్ని సేవా కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పర్కాల లక్ష్మీనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు కొండ్రా అంజయ్య యాదవ్, కార్యనిర్వహణ కార్యదర్శి కల్వల అనిల్ కుమార్, కోశాధికారి రవీందర్, జాయింట్ సెక్రటరీ జలీల్, ప్రెస్ క్లబ్ సభ్యులు దార మధు, గుండారపు శ్రీనివాస్, జీవన్, నగేష్, తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page