హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ ఈద్గా లో రంజాన్

Spread the love

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ ఈద్గా లో రంజాన్ పర్వదిన సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రార్ధనలో పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

……

సాక్షిత : ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో నియామ నిష్ఠలతో ఉపవాస దీక్షలు చేపట్టి రంజాన్ మాసం నేటి చివరి రోజు ముగుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఈద్గాలో ఏర్పాటు చేసిన రంజాన్ పండుగ వేడుకలో పాల్గొన్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదర్ నగర్ డివిజన్ తో పాటు చుట్టూ పక్కల వివిధ కాలనీ ల మైనారిటీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగిందని ఆ అల్లా దయతో మీరు కోరుకున్న విధంగా కోరికలు తీర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ..ముస్లిం సోదరి సోదరులకు హృదయ పూర్వక రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం నుండి ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేసిన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను పవిత్ర ప్రార్థనలతో ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page