ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ* రాం నరేష్ నగర్, హైదర్ నగర్ యొక్క ఔట్ లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చూపుతామని, ఔట్ లెట్ సరిగ్గా లేకపోవడం వలన వర్షకాలం లో చెరువు నిండి లోతట్టు కాలనీ లు ముంపుకు గురి అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని , దీనికి శాశ్వత పరిష్కారంగా ఔట్ లెట్ సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడలని, డ్రైనేజి మ్యాన్ హోల్ ల ను మరమ్మత్తులను చేపట్టి ఇబ్బంది లేకుండా చూడలని, ఇరిగేషన్ మరియు జిహెచ్ఎంసి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఔట్ లెట్ సమస్య శాశ్వత పరిష్కారం చేపట్టాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియచేశారు.
గతంలో వర్షాలకు లోతట్టు కాలనీ లు జలమయంకు గురి అయినవి అని, కట్టను పునరుద్ధరించడం జరిగినది అని, మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని అధికారులకు తెలియజేసారు. అదే విధంగా రాం నరేష్ నగర్, హైదర్ నగర్ లో రోడ్లు, డ్రైనేజి వంటి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ రాజీవ్, మేనేజర్ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్ డివిజన్ ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్ కాలనీ వాసులు నక్క శ్రీనివాస్, వెంకటయ్య యాదవ్, సత్యనారాయణ, కృష్ణా రెడ్డి, చాట్ల రవి, పర్వీన్ సుల్తానా, మాధవి తదితరులు పాల్గొన్నారు.