రాజగోపాల్ నగర్ లేఔట్,అయిలాపూర్ విలేజ్, అమీన్ పూర్ మండల్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజగోపాలనగర్ ప్లాట్స్ కొన్న వారి బాధలు వర్ణానాతితం, ప్రతిఒకరికి ఒక కల ఉంటది తాము తమ జీవితంలో ఒక ఇల్లు కట్టుకోవాలని, అలాంటి కల నేరవేర్చుకోవాలని ఆశతో ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశతో రాజగోపాలనగర్ వెంచర్ లో రూపాయి రూపాయి పోగు చేసుకొని ఇక్కడి వెంచర్ లో ప్లాట్స్ కొన్నారు దాదాపుగా 2500 ప్లాట్స్ కొన్నారు.
అయితే ఇక్కడి రాజగోపాలనగర్ ప్లాట్స్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడి వెంచర్ గల భూమి ప్రభుత్వ స్థలం అని ఆ వెంచర్ మీద కేసులు పెట్టడం జరిగింది అయితే ఇందులో ప్లాట్స్ కొన్న ఓనర్స్ ఒక అసోసియేషన్ గా ఏర్పడి దాన్ని కోర్టులో గెలవడం జరిగిందని, అయితే ఆ కేసు గెలిచినంక మళ్ళా ఇంకో సారి కూడా కోర్టులో కేసు పెట్టడం జరిగిందని దాన్ని కూడా గెలవడం జరిగిందని ఇందులో కొన్న ప్లాట్స్ ఓనర్స్ కొంత మంది తెలిపారు,
అయితే ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే రెండు సార్లు కోర్టులో గెలిచినంక కూడా మళ్ళీ కేసు పెట్టారు అని దాన్ని కొంత మంది దళారులు ఆసరాగా తీసుకొని ఇక్కడి ప్లాట్స్ ఇంక రావు మీకు ఇంక వీటి మీద ఆసలు వదులుకొండి అని మీ ప్లాట్స్ ని బిల్డర్స్ ఒకళ్ళు తీసుకోవటానికి ఉన్నారు ,అయితే మీకు మీ ప్లాట్స్ కి ఇప్పుడు ధర ఇవ్వరు ఐదు సంవత్సరాల తరువాత మీకు మీ ప్లాట్స్ కి తగట్టుగా అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఇస్తారు అని నమ్మించి వారి దగ్గర నుంచి ప్లాట్స్ తీసుకుంటున్నారు అని వాపోతున్నారు ఇక్కడి ప్లాట్స్ ఓనర్స్ కూడా ఇన్ని సంవత్సరాల నుండి రానిది ఎప్పటికీ వస్తది అని నిరాశ తో ఎంతోకొంత వస్తుంది అని కొంతమంది వచ్చిన రేటుకి ఇచ్చేస్తున్నారు, కొంతమంది ఎప్పటికైనా మా స్థలాలు మాకు వస్తాయని పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు, అయితే ఈ ప్లాట్స్ విషయం లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇక్కడి ప్లాట్స్ ఓనర్స్ కి అండగా ఉండాలి అని కోరుతున్నారు.
రాజగోపాలనగర్ ప్లాట్స్ ఓనర్స్ కి ప్రభుత్వం కలగ చేసుకొని న్యాయం చేస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది