పదో తరగతి విద్యార్థులకు బహుమతి ప్రదానం

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

గత విద్యా సంవత్సరం 2022-23 పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన వారికి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేరడ హై స్కూల్ నందు ప్రధమస్థానంలో నిలిచిన విద్యార్థులకు షేక్ ఖాసిం సాహెబ్ జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు షేక్ బిక్కు సాహెబ్ విద్యార్థులకు మెడల్ మరియు నగదు బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచిన ముగ్గురు విద్యార్థులు మేడ స్రవంతి , షేక్ అజిమ్, పులిపాటి రాము, ఈ ముగ్గురు విద్యార్థులకు గత సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో 9.2 జిపిఏ సాధించారు.

ప్రధానోపాధ్యాయులు గ్రామ పెద్దలు సమక్షంలో వారికి బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో నేరేడ జడ్పీ ఎస్ ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు షేక్ మొహమ్మద్ హుస్సేన్, గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ఈశ్వరమ్మ, ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు, ఎంపీటీసీ కొల్లి యామిని, గ్రామ పెద్దలు కొల్లి వెంకయ్య, ముహమ్మద్ సిద్దిక్, శంకర్రావు, రాజు సార్, కనకపుడి వెంకటి, నున్న నాగమణి, సరోజినీ, కే వెంకమ్మ, షేక్ మదర్ సాహెబ్ (జర్నలిస్ట్) పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు వి శ్రీనివాస్, సి హెచ్ లక్ష్మీ నిర్మల, కేఎల్ నరసింహారావు, ఏ లక్ష్మయ్య, ప్రతాప్, జై హర్జియ , ఏ విజయ అమృత కుమార్, ఏ . హంసాలి మరియు గ్రామ ప్రజలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page