అన్నదాతలను అన్నివిధాలా ఆదుకుంటాం.
ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు ఇచ్చారు.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా,
మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రకటనలో సూచించారు. వాగులు వంకలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులు, మూగజీవాల రక్షణకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు సురక్షిత ఏరియాలకు వెళ్లాలని సూచించారు. గ్రామస్థాయిలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకొని ప్రజలకు విస్తృతంగా సేవలను అందించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది తక్షణమే స్పందించి సర్వే నిర్వహించి వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇళ్ళమధ్య, బహిరంగ ప్రదేశాల్లో నీళ్లు నిల్వ లేకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుద్ధ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. విద్యుత్తు స్తంభాలు, తీగల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు.
వ్యవసాయ అధికారులు పంట నష్టం నివారణకు రైతులకు తగు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. అన్నదాతలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని, వర్షపాతం తగ్గగానే పంట నష్టం అంచనా వేసి, రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. ఈ మేరకు సీఎం జగనన్న ఆదేశాలు జారీ చేశారని స్పష్టం చేశారు.
తుఫాన్ కారణంగా ఎటువంటి నష్టం సంభవించకుండా చూడటమే అందరి లక్ష్యం కావాలన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలన్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ తగు సేవలను అందించాలని పిలుపునిచ్చారు.