SAKSHITHA NEWS

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబీ ఉత్సవాలలో భాగంగా పటాన్చెరులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని వీడియో ద్వారా ప్రదర్శించడం జరిగింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయినప్పుడు విద్యుత్ విషయంలో చాలా ఇబ్బందులు ఉండేవి పరిశ్రమలు మూసుకోవాల్సి వస్తుందని ఆంధ్ర నాయకులు ఎద్దేవా చేసినప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలను విక్రమార్కుడిలా విద్యుత్ లోటు నుంచి దేశంలోనే అత్యధికంగా విద్యుత్ వినియోగం రాష్ట్రంగా మార్చారని అలాగే రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.

రాష్ట్రవిర్భావం నుండి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో 156.96 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ సరఫరా అభివృద్ధి జరిగిందని వివరించారు.

విద్యుత్ ఉత్పత్తి, వినియోగం, వ్యయానికి సంబంధించి రాష్ట్ర అవతరణకు ముందు మరియు ప్రస్తుత పరిస్థితులను వ్యత్యాసాలను తెలియజేస్తూ బ్రోచర్ విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 112వ డివిజన్ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ , మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ ,నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అన్ని స్థాయిల అధికారులు పాల్గొనడం జరిగింది.


SAKSHITHA NEWS