SAKSHITHA NEWS

ప్రజల పిర్యాదుతో కొద్దీ రోజుల క్రితం MRO మరియు ఇప్పుడు MRO కార్యాలయ సిబ్బంది 6 గురి ఆకస్మిక బదిలీ

గత 4 – 5 సంవత్సరాలుగా మండల కార్యాలయ అధికారులు మరియు అధికార పార్టీ నాయకుల కలయికలో యధేచ్ఛగ భూ ఆక్రమణలు….

గత 9 సంవత్సరాలుగా శేరిలింగంపల్లి లో సుమారు 9000 కోట్ల రూపాయల ప్రభుత్య భూముల అన్యాక్రాంతం అయినవి అని ఒక అంచనా…

ఒక్క చందానగర్ డివిజన్ లోనే సుమారు 2000 కోట్లా రూపాయల విలువ గల ప్రభుత్య భూములు ఆక్రమణలకు గురి….

ప్రభుత్య భూములు,చెరువులు, నాళాలు, చివరకు పార్క్ లు,స్మశాన వాటికలు కూడా కబ్జాలకు గురి అయినవి

మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి.

శేరిలింగంపల్లి మండల రెవిన్యూ కార్యాలయంలో MRO తో సహా ఆరుగురు సిబ్బంది ఆకస్మిక బదిలీ తో శేరిలింగంపల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత 4 – 5 సంవత్సరాలుగా MRO కార్యాలయ అధికారులు,అధికార పార్టీ నాయకుల కలయికలో ప్రభుత్య భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురి అయినవి.అనేక పిర్యాదుల అనంతరం పై అధికారుల పై బదిలీ నిర్ణయం తీసుకున్నారు.నియోజికవర్గం లో చెరువుల అభివృద్ధి పేరుతో ,నాళాల నిర్మాణం పేరుతో ఖాళీగా ఉన్న ప్రభుత్య భూములను చివరకు ప్రజలకు ఉపయోగపడే పార్కులను, స్మశాన వాటికలను కూడా వదలకుండా అక్రమించుకోవడం జరిగినది.అధికార పార్టీ నాయకులు,అధికారుల అండదండలతో నియోజికవర్గం లో 9 సంవత్సరాలలో సుమారు 9000 కోట్ల రూపాయల భూముల దోపిడీ జరిగినది అని ఒక అంచనా….త్వరలో నియోజకవర్గ మొత్తం వివరాలను.అన్యాక్రాంతం అయిన విషయాన్ని ప్రజల ముందు పెడతాం…

.ఒక చందానగర్ డివిజన్ లోనే సుమారు 2000 కోట్ల రూపాయల భూములు ఆక్రమణలకు గురి అయినవి.ఉదాహరణకు సర్వే నెంబర్ 223 నాలుగున్నర ఎకరాల భూమి సుమారు 400 కోట్ల పై మాటే,సర్వే నెంబర్ 281 దేవుని కుంట ఒక్కటిన్నర ఎకరం సుమారు 150 కోట్లు విలువగల భూమి ఏకంగా కుంటనే మాయం చేశారు. .సర్వే నెంబర్ 210 4000 గజాల GHMC ల్యాండ్ కాంపౌండ్ వాల్ వున్నా కూల్చి వేసి ఆక్రమణకు గురి అయింది.ఇదే విధంగా
చెప్పుకుంటూ పోతే సర్వే నెంబర్ 152,170,174,188,189,205,213,231,234,236,239,100,101 మొదలగు సర్వే నంబర్లు ఉన్న ప్రభుత్య భూములు,కబ్జాదారుల కబంద్ద హస్థల్లో ఉన్నాయి…ఇట్టి ప్రభుత్య భూములను కాపాడి ప్రజా అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేస్తున్నాము.ఇలాంటి ప్రభుత్యానికి నాయకులకు ఇంకొక్కసారి అవకాశం ఇస్తే గంగారాం చేరువు లాంటిదీ అన్యాక్రాంతమై ఈ ప్రాంతం లో ఒక్కప్పుడు గంగారాం చెరువు అనేది ఉండేదని…ప్రజలు అనుకునే రోజు వస్తుందని తెలియచేస్తూ.. శేరిలింగంపల్లి ప్రజలందరూ ఇలాంటి దోపిడీని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వేడుకుంటున్నాము.


SAKSHITHA NEWS