సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు ఎక్కువ నమోదవుతున్నాయో వాటి నియంత్రణకై దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
బుధవారం ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు పరిశీలించారు.
అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించారు. రౌడీలు, కేడీలు, సస్పెక్ట్స్ లపై నిరంతరం నిఘా ఉండాలన్నారు. రాత్రి పెట్రోలింగ్ అధికారులు ముమ్మరం చేయాలని, పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సిసీటిఎన్ఎస్ (క్రైమ్& క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టం)ద్వారా ప్రతి దరఖాస్తులను యఫ్.ఐ.అర్ లను, సిడిఎఫ్, పార్ట్-1, పార్ట్-2 రిమాండ్ సిడి, ఛార్జ్ షీట్, కోర్టు డిస్పోజల్ ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయలని ఆదేశించారు.
ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షణ శాతం పెంచాలని సూచించారు.